సీఎం రేవంత్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!
‘నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను తొందరపడను’ హామీలు అమలు చేసి తర్వాత మాట్లాడాలని సూచన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి మరియు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా...