మనం పర్యావరణం కాపాడుకుందాం: డాక్టర్ బొంతలకోటి శంకరరావు
మన భారత్, గజపతినగరం: ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ప్రకృతి, జీవవైవిధ్య పరిరక్షణకు పిలుపు 54వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజపతినగరం బ్రహ్మకుమారీస్ సెంటర్లో నిర్వహించిన పర్యావరణ అవగాహన సదస్సు ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి అవార్డు గ్రహీత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు డాక్టర్ బొంతలకోటి శంకరరావు ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా హాజరై పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ, ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యం మనుగడకు...