లగేజీ ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం..
చీపురుపల్లి బజాజ్ షోరూం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన రేగిడి రామ్మూర్తి మన భారత్, చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. చీపురుపల్లి మండలం రేగిడి పేట గ్రామానికి చెందిన రేగిడి రామ్మూర్తి (50) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదం చీపురుపల్లి పట్టణంలోని బజాజ్ షోరూం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు...