ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం..
100 మందికి కంటి పరీక్షలు – 15 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, అద్దాలు పంపిణీ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. తలమడుగు మండల బీజేవైఎం మండల అధ్యక్షులు దాతజీ కిరణ్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో...