కార్మికుల వేతనాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
హామీలు అమలు చేయకపోతే సమ్మె తప్పదన్న సీఐటీయూ నేతలు మన భారత్ | నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య విమర్శించారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్మికులను పనులు చేయించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో...