బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీకి ఘన సన్మానం
మన భారత్, తలమడుగు: ఇటీవల నూతనంగా ఏర్పడిన ఆదిలాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్, జిల్లా కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్‌లకు తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో ఘన సన్మానం నిర్వహించారు. గ్రామస్థులు, బీసీ సంఘ నాయకులు కలిసి శాలువాలు కప్పి పూలమాలలతో వారిని అభినందించారు. అలాగే ఇటీవల బీపీ మండల్ అవార్డు అందుకున్న తలమడుగు మండల బీసీ సంఘం అధ్యక్షుడు రవికాంత్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది....