ఆరు నెలల పసికందు ప్రాణానికి ₹16 కోట్ల ఇంజెక్షన్..!
ప్రభుత్వ సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు మన భారత్, విజయనగరం: పుట్టి ఇంకా ఆరు నెలలే అయిన ఓ పసికందు ప్రాణం కాపాడాలంటే అక్షరాలా ₹16 కోట్ల విలువైన అరుదైన ఔషధం అవసరమని వైద్యులు చెప్పడంతో ఓ పేద కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. కళ్ల ముందే తమ చిన్నారి ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే ఏం చేయాలో అర్థంకాక, ప్రభుత్వ సహాయం కోసం ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లాలో వెలుగులోకి...