మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యం: నెల్లిమర్ల ఎస్సై
కొండవెలగాడలో డ్వాక్రా మహిళలతో అవగాహన సమావేశం.. 112, 181 హెల్ప్‌లైన్‌లు, శక్తి యాప్‌పై చైతన్యం మన భారత్, నెల్లిమర్ల: సమాజంలో మహిళలకు రక్షణ, భరోసా కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యం అని నెల్లిమర్ల ఎస్సై స్పష్టం చేశారు. మహిళలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా జీవించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామంలో డ్వాక్రా మహిళలతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి, మహిళల హక్కులు, భద్రత, చట్టపరమైన...