కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు: ఎంపీ
-దేవాపూర్ గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన వంతెన ప్రారంభం మన భారత్, తలమడుగు: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి హామీ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా పలు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తలమడుగు మండలం పరిధిలోని దేవాపూర్ గ్రామంలో ఉపాధి హామీ నిధులతో రూ.30 లక్షల వ్యయంతో వాగుపై...