విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు: పీడీఎస్యూ
ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ విద్య వ్యవస్థ బలోపేతంపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పీడీఎస్యూ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధి పట్ల పాలకులకు కనీస బాధ్యత కూడా కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...