manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 7:37 am Editor : manabharath

ఆ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి..

రోడ్లు–భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ టీపీసీసీ అధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రజలు రవాణా సౌకర్యాల లేమితో విద్య, వైద్యం, ఉద్యోగ అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా నియమితులైన తాంసి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడాల సంతోష్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రవాణా సౌకర్యాలు కీలకమని, కప్పర్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభిస్తే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు ఆశన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా బస్సు సౌకర్యం త్వరగా అమల్లోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..