7 నిమిషాల్లో క్యాన్సర్ చికిత్స.. భారత మార్కెట్లోకి రోచ్ సరికొత్త ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్
మన భారత్, హైదరాబాద్: క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత స్విస్ ఫార్మా సంస్థ రోచ్ (Roche) భారత మార్కెట్లోకి అత్యాధునిక ఇమ్యునోథెరపీ ఇంజెక్షన్‌ను విడుదల చేసింది. నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (NSCLC) చికిత్స కోసం రూపొందించిన ఈ ఇంజెక్షన్ చర్మం కింద ఇవ్వబడే సబ్‌క్యూటేనియస్ థెరపీగా అందుబాటులోకి రావడం వైద్యరంగంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు క్యాన్సర్ రోగులకు గంటల తరబడి ఐవీ డ్రిప్స్ ద్వారా అందించే చికిత్సకు...