ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు..
మన భారత్, గజపతినగరం: గజపతినగరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమానికి ప్రజలు, నాయకులు, కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యలు, వినతులను స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, పింఛన్లు,...