ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహణ
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో శనివారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. మావలలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో దేవాపూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరంలో గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, చూపు సమస్యలు, కంటి సంబంధిత వ్యాధులపై...