తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి..
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం లభించనుంది. గ్రామంలో నెలకొన్న తీవ్రమైన నీటి కొరతను పరిష్కరించేందుకు బోరుబావి పనులు శనివారం ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజల విజ్ఞప్తికి స్పందించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక చొరవ తీసుకొని బోరుబావి వాహనాన్ని గ్రామానికి పంపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కుచులాపూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. వేసవి కాలం...