వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి..
మన భారత్, విజయనగరం: దత్తిరాజేరు మండలం గడసాం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ వాటర్ ప్లాంట్ను రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు శుభారంభం చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. గ్రామ ప్రజలు, మహిళలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గంట్యాడ శ్రీదేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ...