సర్పంచ్ కృషి.. నైట్ హాల్ట్ బస్సు
మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో నైట్ హాల్ట్ బస్సు పునరుద్ధరణకు గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ దంపతులు చేసిన కృషి ఫలించింది. ప్రజల రవాణా సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరకాల బస్సు డిపో మేనేజర్ రాంప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నైట్ హాల్ట్ బస్సు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపారు. దీంతో మండల ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. శుక్రవారం పరకాల డిపో మేనేజర్‌ను కలిసిన...