కళాశాలకు పుస్తకాల విరాళం..
మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “గ్రంథాలయాల ప్రోత్సాహం – గ్రంథాలయాలు : జ్ఞాన హృదయాలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందించడం, గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేయడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులను ఆకట్టుకుంది. విద్యా వారోత్సవాల ఐదవ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత, విశ్రాంత ఎంపీడీవో చట్ల గజ్జరామ్ రచించిన...