ఆదివాసీల సంక్షేమానికి అండగా ఐటీడీఏ
పీవీటీజీ గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం – ఐటీడీఏ పీఓ మంద మకరందు మన భారత్, ఉట్నూర్ : ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) మంద మకరందు తెలిపారు. ఉట్నూరులోని కేబీ ప్రాంగణ సమావేశ మందిరంలో గురువారం ఆదివాసీ తోటి, కొలం సర్పంచులు, వార్డు సభ్యులు, మేధావులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల...