కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లకు శ్రీకారం..
ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఏసీఈ గ్రూపుల్లో ప్రవేశాలకు ఆహ్వానం – ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్ మన భారత్, మొగుళ్లపల్లి : పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు కొర్కిశాల మోడల్/జూనియర్ కళాశాల శుభవార్త అందించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామంలో గల మోడల్ జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత...