manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 4:49 am Editor : manabharath

గ్రామ స్థాయిలో భీమా సేవలపై అవగాహన..

మన భారత్, విజయనగరం

విజయనగరం డివిజన్ పరిధిలో గ్రామ స్థాయిలో పోస్టల్ భీమా సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసు సూచించారు. బుధవారం గజపతినగరం మార్కెట్ యార్డ్ ఆవరణలో సబ్ డివిజన్ పరిధిలోని పోస్టల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు పోస్టల్ భీమా పథకాల ప్రయోజనాలను వివరించి మరింత మంది లబ్ధిదారులను చేర్చే దిశగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్న ప్రత్యేక మేళాను విజయవంతం చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న భీమా పథకాలపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని తెలిపారు.

పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఉపేంద్ర, సబ్ పోస్ట్ మాస్టర్లు, పోస్టల్ అసిస్టెంట్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..