వడదెబ్బల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ నవత
మన భారత్, మొగుళ్లపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రజలు వడదెబ్బలు, హీట్ స్ట్రోక్‌ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారిణి డాక్టర్ నవత సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ నవత, తీవ్రమైన ఎండలు, వేడి గాలుల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు పెరిగే...