వడదెబ్బతో కూలీ కార్మికుడు మృతి..
మన భారత్, మొగుళ్లపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య కూలి పనికి వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం, మొట్లపల్లి గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి రవి (55) రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ప్రతి రోజు లాగానే మంగళవారం ఉదయం కూలి పనికి వెళ్లిన రవి...