manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 3:53 am Editor : manabharath

ఘనంగా కొమురం భీం విగ్రహావిష్కరణ..

మన భారత్, ఆదిలాబాద్

భీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గోన గ్రామంలో కొమురం భీం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ గోడం నగేష్ హాజరయ్యారు.

ముందుగా కొమురం భీం చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామంలో కొమురం భీం విగ్రహం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగానే స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సొంత డబ్బులతో విగ్రహాన్ని అందజేయడం పట్ల గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కొమురం భీం విగ్రహం గ్రామానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, గోన గ్రామ అభివృద్ధి తన బాధ్యత అని అన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను విడతల వారీగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు కోరిన ఈద్గా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామని తెలిపారు.

అదేవిధంగా పాఠశాల ముందు బోరు మంజూరు చేస్తామని, హైస్కూల్‌లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోచమ్మ ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు కూడా మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో డైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..