మహిళలపై అఘాయిత్యాలకు కఠిన శిక్షలు విధించాలి
మన భారత్ ప్రతినిధి, నారాయణపేట: దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు Lakshmi డిమాండ్ చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారించి బాధితులకు తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా మారాయని, చిన్నారులు కూడా సురక్షితంగా లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా...