“కలెక్టర్” తబలా వాయించి.. సరిగమలు పలికి
మన భారత్ ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 15 రోజుల వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. విద్యతో పాటు సృజనాత్మకత, క్రీడా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల సమయంలో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా మ్యూజిక్, కోడింగ్, యోగా, క్రీడలు వంటి విభిన్న...