రిమ్స్ రేడియాలజీ విభాగంలో రోగుల అవస్థలు..
మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, ఇతర పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి చేరుకునే ప్రజలకు సరైన సమయంలో పరీక్షలు జరగకపోవడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిగా వేలాది మంది ప్రజలకు వైద్య సేవలు...