సర్పంచ్ సంతోష్ చొరవ.. తాగునీటి సమస్య పరిష్కారం.!
మన భారత్ | తలమడుగు : దేవాపూర్ గ్రామంలోని వార్డ్ నెంబర్-3లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ శాశ్వత పరిష్కారం చూపించి గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామంలో ముఖ్యంగా వేసవి కాలంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడేవారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొనేవి. కొన్నిసార్లు బోర్లలో నీరు లేకపోవడం, సరైన...