manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 1:59 pm Editor : manabharath

బీజేపీ మండల అధ్యక్షుడిగా రవివర్మ నియామకం

మన భారత్, విజయనగరం:
పాకలపాటి రవివర్మను భారతీయ జనతా పార్టీ గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ సోమవారం విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ అధికారికంగా అందించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన రవివర్మ మాట్లాడుతూ గంట్యాడ మండలంలో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానికి విస్తరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ బీజేపీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రవివర్మ నాయకత్వంలో గంట్యాడ మండలంలో బీజేపీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి శ్రీను, యువమోర్చా జిల్లా అధ్యక్షులు రాజన్న రమణ, పూర్వ యువమోర్చా జిల్లా అధ్యక్షులు పిల్ల నవీన్ కుమార్, గంట్యాడ కార్యకర్తలు ముదిని ఈశ్వరరావు, చప్ప జనార్ధన్, రంబ దేవుడు బాబు, బొబ్బిలి రమేష్, బొబ్బిలి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..