తెలంగాణకు ప్రధాని ఏమిచ్చారు..?
మన భారత్, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజలు ప్రధానమంత్రి పర్యటన ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, నిధులు వస్తాయని ఆశించారని, కానీ ఆ ఆశలు నెరవేరలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవప్రదంగా స్వాగతం పలికామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల్లో...