పశువుల అక్రమ రవాణాపై కఠిన నిఘా..
మన భారత్, తలమడుగు: బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. మండలంలోని లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద ఆదివారం భారీ స్థాయిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వైపు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. బక్రీద్ పండుగ సమయంలో పశువుల కొనుగోలు, రవాణా ఎక్కువగా...