రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ప్రతిభ..!
మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ నాలుగో తరగతి ప్రవేశ ఎంపిక పరీక్షల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి జక్కుల శ్రీనివాస్ తెలిపారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, కోచింగ్ అందించామని తెలిపారు. క్రమశిక్షణతో సాధన చేయడం వల్లే విద్యార్థులు రాష్ట్ర స్థాయి పరీక్షల్లో...