రేవంత్ జీ.. బీజేపీలోకి వచ్చేయ్ : మోదీ
మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు నేతలు పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ ముచ్చటించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వెండి నంది జ్ఞాపికను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇద్దరు నాయకులు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నట్లు...