అధికారుల కాళ్లు మొక్కిన రైతులు..!
రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతల ఆందోళనలు మన భారత్, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని జాతీయ ప్రధాన రహదారిపై రైతులు వరి ధాన్యంతో బైఠాయించి నిరసన చేపట్టారు. కష్టపడి పండించిన పంటను సమయానికి కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. ధాన్యం...