రాంపూర్‌లో విస్తృత వాహన తనిఖీలు..
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు పోలీసుల సూచనలు మన భారత్, ఆదిలాబాద్: ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాంపూర్ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను రాంపూర్ ఏఎస్సై ఆశన్న పోలీస్ సిబ్బందితో కలిసి చేపట్టారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలను...