ఈతకు వెళ్లే విద్యార్థులకు ఎస్సై సూచన..
మన భారత్, విజయనగరం జిల్లా: వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఈత కొట్టడానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని నెల్లిమర్ల ఎస్సై గణేష్ సూచించారు. శనివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల థామస్‌పేట ఫుట్‌బాల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న చంపావతి నది తీర ప్రాంతాన్ని పోలీసు సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ, వేసవి సెలవుల కారణంగా విద్యార్థులు ఖాళీ సమయంలో నదులు, చెరువులు, కాలువలు వంటి నీటి వనరుల వద్దకు...