గ్రామంలోకి హిజ్రాల రాకపై నిషేధం..
మన భారత్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామంలో గ్రామ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో శుభకార్యాల సమయంలో అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో హిజ్రాల గ్రామ ప్రవేశంపై నిషేధం విధిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) తీర్మానం చేసింది. గ్రామంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని ఈ అంశంపై చర్చించారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర...