manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 3:21 pm Editor : manabharath

హనుమాన్ మందిరంలో సిందూర పూజలు..

మన భారత్, తాంసి:

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో గల హనుమాన్ మందిరంలో భక్తిశ్రద్ధల నడుమ సిందూర పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన హనుమాన్ దీక్షా పరులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేదమంత్రాల నడుమ పూజారులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అనంతరం స్వామివారికి సిందూర అలంకరణ చేశారు. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు, పూలమాలలు సమర్పించి తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.

సిందూర పూజకు హాజరైన భక్తులు హనుమంతుని కృపతో గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తి సందడి కనిపించింది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..