హిరో విజయ్‌కు గ్రీన్ సిగ్నల్..!
మన భారత్, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు మార్గం సుగమమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవసరమైన మెజారిటీకి చేరువ కావడంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా విజయ్ వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల్లో సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో టీవీకేకు అవసరమైన 118...