జొన్న రైతులకు కీలక సూచన..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న మరియు ఇతర ధాన్యాల నిల్వలు భారీగా పేరుకుపోవడంతో రైతులకు మార్కెట్ అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం మార్కెట్ యార్డులో స్థలం పూర్తిగా నిండిపోయిందని, ఈ పరిస్థితుల్లో కొత్తగా జొన్న పంటను యార్డుకు తీసుకురావద్దని సెంటర్ ఇన్ఛార్జ్ రైతులను కోరారు. ఇటీవల జిల్లాలో జొన్న పంట కోతలు ఊపందుకోవడంతో రైతులు పెద్ద ఎత్తున తమ పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే ఇప్పటికే యార్డులో మొక్కజొన్న,...