రాష్ట్ర మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు..
మన భారత్ ముస్తాపాపూర్: ముస్తాఫాపూర్ గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపించేలా కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు....