రిమ్స్‌లో పనిచేయని లిఫ్టులు..
మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో మౌలిక వసతుల సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆస్పత్రిలోని లిఫ్టులు పనిచేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారు. నాలుగో అంతస్తు వరకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు...