manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 4:15 am Editor : manabharath

నవ్యశ్రీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు..

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పట్టణంలోని 21వ వార్డు క్రాంతి నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసావార్ వెంకటి కుమార్తె నవ్యశ్రీ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యశ్రీకి తల్లిదండ్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు.

బర్త్‌డే సందర్భంగా కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నవ్యశ్రీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని దేవుని ప్రార్థించారు. అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బంధుమిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు నవ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ,  భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్నారిపై కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పుట్టినరోజు వేడుకల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని నవ్యశ్రీకి ఆశీస్సులు అందజేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..