ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
మన భారత్, శృంగవరపుకోట నియోజకవర్గం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పష్టం చేశారు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని లక్కవరపుకోట టిడిపి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 38 వినతులు అందగా, అందులో ప్రధానంగా పెన్షన్లకు సంబంధించిన...