రహదారి పక్కనే మద్యం షాపు కలకలం
మన భారత్, మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రహదారి ప్రక్కనే నిర్వహిస్తున్న మద్యం షాపు కారణంగా స్థానికులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన రెండు వైన్ షాపులలో ఒకటి సరైన పార్కింగ్ సౌకర్యం లేకుండా నడుస్తుండటం తో, అక్కడికి వచ్చే వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాలను రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. దీనివల్ల ప్రధాన రహదారిపై తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రం...