ఎల్లమ్మ ఆలయంలో నగదు చోరీ..
మన భారత్ | మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దొంగతనం జరగడం స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. పెద్ద కోమటిపల్లి గ్రామ శివారు తాటి వనంలో ఉన్న ఈ దేవాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హుండీలోని నగదును అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల వివరాల ప్రకారం, గౌడ కులస్తుడు మెరుగు బిక్షపతి బుధవారం ఉదయం దేవాలయానికి వెళ్లినప్పుడు హుండీ పగిలి ఉండటం...