మూగజీవులకు తాగునీటి సదుపాయం…
మన భారత్ | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని అట్నంగూడ గ్రామపంచాయతీలో మూగజీవుల కోసం తాగునీటి సదుపాయం కల్పిస్తూ గ్రామ సర్పంచ్ ఆత్రం సంజీవ్ ఆదర్శప్రాయ చర్య చేపట్టారు. చెరువులు ఎండిపోవడంతో పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ప్రత్యేకంగా పశువుల కోసం నీటి ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటోంది. గ్రామంలో వేసవి కాలం తీవ్రత పెరగడంతో సహజ జల వనరులు ఎండిపోవడం వల్ల పశువులకు తాగునీరు...