మృతుని కుటుంబానికి నేతల పరామర్శ..
మన భారత్ | మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నేరెళ్ల మొగిలి గౌడ్ సోమవారం రాత్రి తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల వివరాల ప్రకారం, మొగిలి గౌడ్ ప్రతిరోజు మాదిరిగానే తాటి...