ఆ ఊరిలో ఐదుగురికి జైలు శిక్ష..
మన భారత్ ,ఇచ్చోడ: ఇచ్చోడ ప్రాంతంలో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఐదుగురికి జైలు శిక్ష విధించబడింది. ఈ విషయాన్ని ఇచ్చోడ సబ్ ఇన్‌స్పెక్టర్ బండారి రాజు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసులను విచారించిన బోథ్ న్యాయమూర్తి సందీప్ కుమార్, నిందితులు నితిన్, గోవిందరావు, సంతోష్, బాలాజీ, భూమన్నలకు ఒక్కరోజు జైలు శిక్ష విధించారు....