అన్నదమ్ములు మృతి.. నలుగురికి చూపు
మన భారత్, విజయనగరం: విజయనగరం సమీపంలోని జొన్నవలస వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొన్నది. శ్రీకాకుళం జిల్లా కొప్పర కొత్తవలసకు చెందిన అన్నదమ్ములు తోట అజయ్ (23), తోట విజయ్ (22) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈ విషాదంలోనూ మానవతా విలువలు వెలుగుచూశాయి. మృతుల కుటుంబ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధుల అవగాహనతో ముందుకు వచ్చి...